Saturday, August 9, 2008

బాషకు అందని భావం స్నేహం


కల నుంచి ఇలకు జారిన కన్నీటి బొట్టు మన స్నేహం
కలను చెదిరి పోనినీయకు అది రేపటి ఆశను
చెరిపివేస్తుంది,
కన్నీటిని దాచకు అది మనసూ బరువు ను
పెంచుతుంది.

కల చెదిరితే కన్నీటిని మిగిలుస్తుంది
కన్నీరు
ఇంకితే అది కనుపపాలను ఎడారిని సృష్టిస్తుంది,
నీపెదవులపై చిరినవ్వు నీకు మాత్రమే సొంతం
కానీ నీ కన్నుల దాగిన కన్నీరు నాకు సొంతం.

చిరునవ్వును మాత్రమే నలుగురికి పంచకు
అది చెలిమిని దూరం చేస్తుంది,
చిరు కలతను అయిన దాచక కన్నీట పంచుకో
అది కన్నుల దాహని తీరుస్తుంది.

నేను లేకున్నా నీవు జీవించి వుండాలి అనేది త్యాగం
నేను జీవించి వుండగా నీవు తుది శ్వాస ను
విడవాలి అనే నా స్వార్ధం.

"నువ్వున్న ప్రతి క్షణం నే జీవించి వుండాలి
అని నా స్వార్ధం,
నేనులేని ప్రతిక్షణం నీకు శాపం కాకూడదని
నా ప్రయత్నం."